నా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే Like, Comment, Share. నచ్చకపోతే Dislike/Comment :-) .మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ కి Subscribe అవ్వండి.
Sunday, October 11, 2020
దుష్ప్రచారం/Propaganda అంటే ఏమిటి ? చరిత్ర ఏం చెప్పింది ?
నా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే Like, Comment, Share. నచ్చకపోతే Dislike/Comment :-) .మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ కి Subscribe అవ్వండి.
Friday, May 29, 2020
డబ్బు గురించి మీకు తెలియని నిజాలు
నా యూట్యూబ్ ఛానల్ ( Voice Over తో). ఈ వీడియో కనుక మీకు నచ్చితే Like, Comment, Share. నచ్చకపోతే Dislike/Comment :-) .మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ కి Subscribe అవ్వండి.
Friday, April 17, 2020
మీకు తెలియని మతాల చరిత్ర
సీజర్ చక్రవర్తి రోమన్ సామ్రాజ్యాన్ని పరిపాలించే కాలంలో అంటే ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితం జుడియా అన్న రాష్ట్రం లో జీసస్ అనే అబ్బాయి పుట్టాడు. అతని బాల్యం గురించి సరైన సమాచారం లేదు. ఆయన జీవించింది 30 ఏళ్ళు మాత్రమే. అందులోనూ తన జీవిత కాలం లోని చివరి 3 సంవత్సరాలు, అతని చుట్టు పక్కల ప్రాంతాలలో కొన్ని మత బోధనలు చేసి మత ప్రవక్తగా అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఇతనికి కొంతమంది శిష్యులు కూడా తయారయ్యారు. ఇతని బోధనలు అప్పటికే ప్రచారంలో ఉన్న ఇసయా అనే యూదు ప్రవక్త బోధనలను పోలి ఉండేవి. అందుకే ఇప్పటికీ కొంత మంది యూదులు, జీసస్ తమ సంప్రదాయాలను దోచుకున్నాడని భావిస్తారు. అయితే జీసస్ బోధనలు అప్పటి దేశ కాల మాన పరిస్థితులకి నిజంగా విప్లవాత్మకమయినవి. జీసస్ ని అప్పటి కాలపు విప్లవకారుడి గా భావించాలి. మానవులందరూ సమానమే అన్న జీసస్ భావాలు రాజద్రోహకరంగా ఉన్నాయని ప్రకటించి రోమన్ అధికారులు అతనికి మరణశిక్ష విధించారు. అక్కడితో జీసస్ కధ ముగిసింది.
అయితే అసలు కధ ఆ తర్వాతే మొదలయింది. జీసస్ బోధనలు ఆధారంగా సెయింట్ పాల్ అనే ఆయన అనేక రచనలు చేశాడు. మానవుల పాపాలను ప్రక్షాళణ చెయ్యటం కోసం జీసస్ తన ప్రాణాలను త్యాగం చేశాడని మొదట చెప్పింది ఇతనే. అయితే ఈ మాటలు జీసస్ స్వయంగా ఎప్పుడూ చెప్పలేదు. అంతటితో ఆగకుండా, స్త్రీలు వినయంగా ఉండాలని, బానిసలు తిరుగుబాటు చెయ్యకూడదని లాంటి ఉన్నత వర్గాలను సంతృప్తి పరిచే తన సొంత అభిప్రాయలను జీసస్ భావాలుగా ప్రచారం చేశాడు. ప్రతి వ్యక్తికి తిరుగుబాటు చెయ్యగల విలువ ఉందన్న జీసస్ భావాలకి ఇవి పూర్తిగా విరుధ్ధం. తొలి దశలోని చర్చి వ్యవస్థ బలపడటానికి ఈ సెయింట్ పాల్ బోధనలు ఎక్కువగా దోహదం చేశాయి. తరువాత ఈ వ్యవస్థ క్రైస్తవ మతంగా ప్రపంచ ప్రసిధ్ధి పొందింది. అంటే విచిత్రంగా ఏ పాలక వర్గాల ఆగ్రహానికి జీసస్ ప్రాణ త్యాగం చేశాడో అదే పాలక వర్గాల ఆదరణ పొందే విధంగా క్రైస్తవ మతం మార్చబడింది.
జీసస్ కి 500 సంవత్సరాలకి ముందు ఉత్తర భారత దేశంలోని గంగా మైదానంలో అనేకా చిన్న చిన్న రాజ్యాలు ఉండేవి. అవి తమలో తాము నిత్యం పోట్లాడుకునేవి. అలాంటి ఒక రాజ కుటుంబం లో సిధ్ధార్ధుడు అనే ఒక అబ్బాయి పుట్టాడు. అతను పెరిగి పెద్దయ్యాక నదీ జలాలకి సంబంధించి పక్క రాజ్యంతో యుధ్ధం చేయవలసి వచ్చింది. సహజంగానే సున్నిత మనస్కుడు అయిన సిధ్ధార్ధుడు ఇలాంటి గొడవలకి భయపడి భార్యని, కుమారుడినీ, రాజ్యాన్ని వదిలి జ్ఞానం కోసం అన్వేషణ చెయ్యటం మొదలుపెట్టాడు. ఆ ప్రయత్నం లో పుట్టిందే బౌధ్ధ మతం. తర్వాత సిధ్ధార్ధుడే గౌతమ బుధ్ధుడిగా ప్రసిధ్ధి పొందాడు. బుధ్ధుని తత్వశాస్త్రం మానవుని మనస్తత్వాన్ని అర్ధం చేసుకున్నంత గొప్పగా ఆ నాటి వరకూ ప్రపంచం లోని ఏ తత్వశాస్త్రమూ అర్ధం చేసుకోలేదు. కాని దాని ఫలితాలు మాత్రం అందరికీ సమానంగా అందలేదు. జీసస్ శిష్యుల మాదిరి గానే బుధ్ధుని శిష్యుల అతి ఉత్సాహం కారణంగా బుధ్ధుని బోధనలు కూడా పూర్తిగా మారిపోయాయి. బౌధ్ధుల అభిప్రాయభేధాల కారణంగా తర్వాత బౌధ్ధం రెండు శాఖలు గా చీలిపోయింది.
వెయ్యి సంవత్సరాల క్రితం భారత దేశం లో హిందూ మత శాఖలయిన శైవులు వైష్ణవుల మధ్య భయంకరమయిన గొడవలు జరిగాయి. అయితే ఈ గొడవలకీ శివ, విష్ణువులకి ఏ సంబంధమూ లేదు. ఇవి తమ అధికారాన్ని నిలుపుకోవటానికీ, సంపదల మీద ఆధిపత్యానికీ రెండు వర్గాలు మధ్య దేవుడి పేరుతో జరిగిన యుధ్ధాలు మాత్రమే. దీని పర్యవసానమే దక్షిణ భారత దేశంలో నిర్మించబడ్డ గొప్ప గొప్ప శైవ, విష్ణు ఆలయాలు.
అరేబియన్ ఎడారిలో మక్కా అన్న చిన్న పట్టణం లో 570వ సంవత్సరంలో మహమ్మద్ ఇబిన్ అబ్దుల్లా అనే ఆయన పుట్టాడు. భర్తను పోగొట్టుకున్న ఒక ధనిక స్త్రీని పెళ్ళిచేసుకుని 40 ఏళ్ళ వయసు వచ్చేవరకూ సామాన్యమయిన జీవితాన్ని గడిపాడు. ఆ తర్వాత అతనికి భగవత్ సంబంధమయిన ఊహలు రావటం ప్రారంభమయ్యాయి. అప్పుడే, ఒక్కడే అయిన దేవునికి తాను ప్రవక్తనని ప్రకటించుకున్నాడు. ఆ భావాలే తర్వాత ఇస్లాం మతంగా అవతరించి, ఆ మతానికి అనేకమంది అనుయాయులు ఏర్పడ్డారు.
ఇలా, చరిత్రకారుల కోణం లో అన్ని మతాల చరిత్రని జాగ్రత్తగా గమనిస్తే మనకి అర్ధమయ్యే విషయం ఏమిటంటే, కొంతమంది మహాత్ముల గొప్ప ఆలోచనలని Hijack చేసి, వాటికి తమ సొంత భావాలు జోడించి, తద్వారా సొంత అజెండాని అమలు పరచటం ద్వారా సామాన్యుల మీద ఆధిపత్యం చెలాయించటం/గుర్తింపు పొందటం మానవ చరిత్రలో ఒక ముఖ్యమయిన కుతంత్రం అని. ఈ ఆధిపత్యం కోసమే, ఉమ్మడి కుటుంబం వేరు పడినట్టు ప్రతి మతం మళ్ళీ అనేక శాఖలుగా విడిపోయింది.
ఇలా Hijack చేయబడ్డ వాళ్ళల్లో ఇప్పటి కాలం లో మహాత్మా గాంధీ, అంబేద్కర్, వల్లభాయ్ పటేల్ కూడా ఉన్నారు. అయితే ఇప్పటివరకూ మనం మాట్లాడుకున్నది, ఇలాంటి మహాత్ములని నిజంగా, నిజాయితీగా ఆదర్శంగా తీసుకునే వారి గురించి కాదు. కేవలం దుర్వినియోగం చేసే వాళ్ళ గురించి మాత్రమే.
Friday, April 3, 2020
అందరూ తెలుసుకోవలసిన 25 కుతంత్రాలు : క్విడ్ ప్రో కో గురించి తెలిస్తే షాక్ అవుతారు.
నా యూట్యూబ్ ఛానల్ ( ప్రస్తుతానికి No Voice Over). ఈ వీడియో కనుక మీకు నచ్చితే Like, Comment, Share. నచ్చకపోతే Dislike/Comment :-) .మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ కి Subscribe అవ్వండి.
Thursday, March 19, 2020
ఈ పోస్టుకి, కరోనా వైరస్ కి సంబంధం ఉంది.
ఆఫ్రికా ఖండం నుంచి మానవ జాతి విస్తరణ
Image Courtesy : Sapiens - A Brief History of Humankind.
ఇంకా క్లుప్తం గా చెప్పాలంటే ఒక దృగ్విషయం యొక్క మూల కారణం/మూల కారకం/మూల కారకులు ఎప్పుడూ నిశ్శబ్దంగా అజ్ఞాతంగానే ఉంటాయి/ఉంటారు. వాటి విస్తరణ మాత్రం ప్రభంజనమవుతుంది. కానీ ఇది కూడా ప్రకృతి మరియు జీవుల సహజ క్రమాన్ని సూచించే Bell Curve లాంటిదే. వీటి పని అయిపోయాక ఎక్కడో ఒక చోట వీటి ప్రభావం అంతమవక తప్పదు.
ప్రస్తుతం కరోన వైరస్ దాని జన్మ స్థానమయిన చైనా లో తగ్గుముఖం పట్టింది. కానీ ప్రపంచం మొత్తం చాలా వేగంగా వ్యాపిస్తుంది. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నదానికి, దీనికి ఏమయినా సంబంధం ఉందేమో చూడాలి.
Friday, March 13, 2020
రాజకీయ నాయకుల వివాదాస్పద వ్యాఖ్యల వెనుక అసలు కారణం (2:59 నిమిషాలు)
ఈ వీడియో కనుక మీకు నచ్చితే Like, Comment, Share. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ కి Subscribe అవ్వండి.
Friday, March 6, 2020
అందరు తెలుసుకోవలసిన 25 కుతంత్రాలు | కలుపుకోవటం | Assimilation
ఈ వీడియో కనుక మీకు నచ్చితే Like, Comment, Share. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ కి Subscribe అవ్వండి.
Friday, February 28, 2020
అందరు తెలుసుకోవలసిన 25 కుతంత్రాలు | విభజన
ఈ వీడియో కనుక మీకు నచ్చితే Like, Comment, Share. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ కి Subscribe అవ్వండి.
Monday, February 24, 2020
అందరు తెలుసుకోవలసిన 25 కుతంత్రాలు | పరిచయం
ఈ వీడియో కనుక మీకు నచ్చితే Like, Comment, Share. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ కి Subscribe అవ్వండి.
Saturday, January 11, 2020
మృతజీవుల మాతృభాష
Subscribe to:
Posts (Atom)