"కధలో ఎక్కడయినా ఒకచోట తుపాకీ గురించిన ప్రస్తావన వస్తే కధ ముగిసేలోపు ఆ తుపాకీ కనీసం ఒక్కసారయినా పేలి తీరాలి." ఇది కధ గురించి చెకోవ్ చెప్పిన ప్రాధమిక సూత్రం. దీని ప్రకారం కధకు సంబంధం లేని ఏ చిన్న విషయం కధలో ఉండటానికి వీల్లేదు. ఇదే సూత్రం సినిమా కధలకి కూడా వర్తిస్తుంది. అంతే కాకుండా Unity of Time and Place ని పాటించిన కధలు కలిగిన సినిమాలు కూడా ఖచ్చితంగా మంచి సినిమాలవుతాయి. కధ చెప్పే విధానం సూటిగా ఉందా ? క్లిష్టంగా ఉందా ? అనేది మాత్రం దానిని అర్ధం చేసుకోగలిగిన ప్రేక్షకుల స్థాయిని బట్టి మారుతుంది. ఒక సినిమా బాగుంటే బాగుందని, లేకపోతే బాలేదని చెప్పటానికి ప్రేక్షకులకి ఏ విధమయిన మొహమాటం ఉందదు. కానీ ఈ సినిమా చూసిన వాళ్ళు మాత్రం సగం మంది చాలా బాగుందని, సగం మంది అసలు బాగో లేదని చెప్పటానికి ఏదో బలమయిన కారణమే ఉండాలి. ఆ కారణం ఏంటో తెలుసుకోవాలనే ఉత్సుకతే నన్ను ధియేటర్ వరకూ వెళ్ళి ఈ సినిమా చూసేలా చేసింది. దర్శకుడు సుకుమార్ ఇప్పటి వరకూ తీసిన సినిమాలన్నింటిలోనూ తన భిన్నమయిన ఆలోచనా విధానాన్ని ఉపయోగించి తెలివిగా Handle చేసి అన్ని రకాల ప్రేక్షకులనీ మెప్పించగలిగాడు. కానీ ఈ సినిమాలో మాత్రం ఒక మెట్టు పైకెళ్ళి మామూలు ప్రేక్షకులు అందుకోలేని స్థాయిలో ఈ సినిమాని తీర్చిదిద్దాడు. క్లిష్టమయిన విషయాలను క్లిష్టంగానే చెప్పటం ఒక పధ్ధతి. Stephen Hawking పుస్తకం "A Brief History of Time" లాగా క్లిష్టమయిన విషయాలను సరళంగా చెప్పగలగటం కూడా ఒక పధ్ధతి. సరళమయిన విషయాలను సరళంగానే చెప్పటం మరో పధ్ధతి. కానీ సరళమయిన విషయాన్ని ఒక "పజిల్" లాగా మార్చి ఆ పజిల్ ని అర్ధం చేసుకోగలిగిన ప్రేక్షకులకి ఒక 'కిక్' వచ్చే పధ్ధతిలో మలచిన సినిమానే ఈ '1-నేనొక్కడినే'. అప్పుడెప్పుడో Reverse Screenplay పధ్ధతిలో అద్భుతం గా తీసిన ఉపేంద్ర A సినిమా, ఆ తర్వాత అకీరా కురసోవా 'రోషోమన్ ' శైలిలో కమల్ హాసన్ తీసిన 'పోతురాజు చెప్పినట్టు ' సినిమా మళ్ళీ నాకు తెలిసి ఈ మధ్యన వచ్చిన 'పిజ్జా' సినిమాల తర్వాత మళ్ళీ ఆ విధమయిన పధ్ధతిలో సుకుమార్ తీసిన సినిమా ఇది.
ఇంక సినిమా విషయానికి వస్తే Integrated Disorder అనే మానసిక వ్యాధితో బాధపడే ఒక చిన్నపిల్లాడు తన తల్లిదండ్రులని చంపిన వాళ్ళ మీద పెద్దయ్యాక ఎలా పగ తీర్చుకున్నాడు అనేది. మానసిక వ్యాధి - పగ అనగానే మనందరికీ బాగా అలవాటయిఫోయిన గజిని సినిమా లాంటిది అనుకుంటాం గానీ ఈ సినిమా అందుకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది.
ఈ సినిమాలో నాకు నచ్చిన అంశాలు
హీరో గోవా వెళ్ళాలని నిర్ణయం తీసుకునే సన్నివేశం.
చిన్నపిల్లలకి అబధ్ధాలు చెప్పొద్దని మహేష్ బాబు చెప్పే సన్నివేశం.
ఇంటర్వెల్ ముందు.
విలన్ (నాజర్) హీరోకి గతం గురించి చెప్పేటప్పుడు ట్యాక్సీ డ్రైవర్ స్థానం లో తనని, తన స్థానంలో ట్యాక్సీ డ్రైవర్ ని ఊహించి తప్పుగా చెప్పి హీరోని మోసం చెయ్యటాన్ని ఒక ట్విస్ట్ గా ఉపయోగించటం.
చివరిలో హీరో తన దగ్గర ఉన్న, తండ్రి కనిపెట్టిన కొత్తరకం వరి వంగడం గురించి విలన్ కి చెపితే గానీ విలన్ హీరో కి అతని తల్లిదండ్రుల గురించిన విషయాలు చెప్పకపోవటం. హీరో ముందు తన తల్లిదండ్రుల విషయాలు తెలుసుకుంటే గానీ విలన్ కి తన దగ్గర ఉన్న వరి వంగడం గురించి విలన్ కి చెప్పకపోవటం. రెంటిలో ఏది ముందు జరిగినా ముందు చెప్పిన వాడిని రెండో వాడు చంపటం ఖాయం అనే విషయం ఇద్దరికీ ముందే తెలిసిపోవటం అనే Dead Lock అనే Unending Process ని చివరికి హీరో అతనికి తన తల్లిదండ్రుల గురించి తనకి తెలియటం కన్నా తన తండ్రి ఆశయం నెరవేర్చటమే ముఖ్యమని భావించి ఆ విషయంలో రాజీ పడి విలన్ ని చంపటానికే నిర్ణయించుకోవటం. ఈ విధమయిన Dead Lock అనే దృగ్విషయంలో ఉన్న ప్రత్యేకత ఏ సాఫ్టువేరు ఇంజినీర్లకో, ఎలక్ట్రానిక్ ఇంజినీర్లకో అయితే సులువుగా అర్ధమవుతుంది గానీ లేకపోతే మామూలు ప్రేక్షకుడికి అందులో ఏ విధమయిన ప్రత్యేకతా కనిపించదు.
చివరిగా హీరో కి చిన్నప్పుడు తల్లి నేర్పించిన రైం గుర్తుకొచ్చి తన ఇల్లు ఎక్కడుందో కనుక్కోగలగటం.
ఈ సినిమాలో కామెడీ ఎలాగూ అతకదు/లేదు కాబట్టి ఆ విషయం పక్కన పెడదాం. కాని కొన్ని అసంబధ్ధమయిన ఫైట్లు, సాధారణంగా ఇలాంటి సినిమాలకి చాలా అవసరమయిన మంచి నేపధ్య సంగీతం/సంగీతం లేకపోవటం ఈ సినిమాకి పెద్ద లోటు.
కొన్ని చిన్న చిన్న లాజిక్ లు తప్పినా గానీ మొదట్లోనే మనం చెప్పుకున్న ప్రాధమిక సూత్రాలకి ఈ సినిమా దగ్గరగానే ఉంది కాబట్టి ఇది ఒక మంచి సినిమాగానే చెప్పుకోవచ్చు. కానీ తుపాకీలూ వాటి పేలుళ్ళు పరిమితి దాటటం వల్లా, దాంతో పాటు Repeated Scrennplay విధానం వల్లా మొదటి సగం అసక్తి గా అనిపించదు. డిస్కవరీ ఛానల్లో జింక ని వేటాడే పులిని చూడమంటే ఎవరయినా ఆసక్తిగా చూస్తారు గానీ Time Travel గురించి చూడమంటే ఎంతమంది చూస్తారు? అలాగే వినోదం కోసం సినిమాకెళ్ళే మామూలు ప్రేక్షకుడికి పజిల్ ఇచ్చి అర్ధం చేసుకోమంటే అది ఎంతమందిని చేరుకోగలదు అన్నదే ముఖ్యమయిన ప్రశ్న. ప్రేక్షకుల తెలివితేటలని తక్కువ అంచనా వెయ్యటం ఎంత తెలివితక్కుతనమో, ఇలా తీసిన సినిమా అందరినీ మెప్పించాలనుకోవటం కూడా అంతే తెలివితక్కువతనం. అంతకన్నా ముఖ్యం, అన్నిరకాల ప్రేక్షకులనీ రీళ్ళతో పాటు పరిగెట్టించగల సినిమా నే నిజమయిన సినిమా. ఆ విధంగా చూస్తే ఆ విషయంలో ఈ సినిమా సఫలీకృతమవ్వలేదనే చెప్పటానికి నాకూ ఏ మొహమాటం లేదు.

రివ్యూ చాల బాగుందండి.నిజం నిష్టురమైన చాల బాగాచెప్పారు
ReplyDeleteThanks andi.
ReplyDeleteGood Review.
ReplyDeleteThank you for your Comment sisira gaaru.
Deleteచెకోవ్ కధలు నేను చదవాలి అన్నవిషయం అర్ధమయ్యింది.
ReplyDeleteBrief History of Time అనేది కేవలం మనకు పైపైని విషయాలను చెప్పడానికి ఉద్దేశ్యించినది. అందులో చర్చించబడే విషయాలను అర్ధంచేసుకోడానిక్కూడా కొంచెం background కావాలి. ఇది నా అనుభవం.
Thank you for you comment Sreenadh gaaru.
Deleteఆ పుస్తకం అంతరిక్ష శాస్త్రానికీ, భౌతిక శాస్త్రానికి సంబంధించి చాలా విషయాలు సాధారణం గా ఎక్కువ మంది భయ పడే విధంగా కఠినమయిన సూత్రాలూ, సమీకరణాల ప్రస్తావన ఏమీ లేకుండా ఎవరికయినా సులువుగా అర్ధమయ్యే రీతిలో రాయబడింది. ఒక వేళ సమీకరణాలు అవీ ఎక్కువగా ఉండి ఉంటే అంత ప్రజాదరణ పొంది ఉందేది కాదు. ఈ కారణంగానే ఒక్క E=MC(Square) తప్ప ఏ ఇతర సమీకరణాల గురించీ సూటిగా ప్రస్తావించ కుండా కేవలం ఉదాహరణలతో మాత్రమే వివరించానని రచయిత ముందు మాటలో కూడ చెప్పాడు. అందుకే రివ్యూ లో ఆ సందర్భం కోసం ఈ ఉదాహరణని ప్రస్తావించాను.